అనారోగ్యంతో చనిపోయిన తండ్రి.. తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుమారుడు!
- కర్నూలు జిల్లాలో ఘటన
- 10 రోజుల క్రితం తండ్రి బిసయ్యకు అనారోగ్యం
- నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన బిసయ్య
దీంతో ఆయన్ను 10 రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయారు. దీంతో తండ్రి మరణాన్ని ఓబులేసు తట్టుకోలేకపోయాడు. బాధతో కుమిలిపోతూ గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తండ్రీకొడుకులిద్దరూ చనిపోవడంతో బసపురంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.