ఇప్పటివరకూ చూసింది ట్రయిలరే... ముందుంది అసలు సినిమా: నితిన్ గడ్కరీ
- ముందుముందు మరింత సంక్షేమం
- కాంగ్రెస్ విపక్షానికి మాత్రమే పరిమితం
- ఎన్ని పార్టీలు కలిసినా బీజేపీని ఏమీ చేయలేరు
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని, అయినా, తమ పార్టీని ఏమీ చేయలేరని గడ్కరీ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీపై దేశ ప్రజలకు నమ్మకం లేదని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ గెలుస్తుందంటే, ఎవరికీ విశ్వాసం కలగడం లేదని అన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని నెహ్రూ హయాం నుంచి చెబుతున్న కాంగ్రెస్, ఇప్పటివరకూ ఆ పని చేయలేకపోయిందని, తాజాగా 'న్యాయ్' అంటూ మరో పథకాన్ని తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు. మసూద్ అజర్ అంశమై ఇండియా చూపిన దౌత్యనీతికి ప్రపంచ దేశాలు అండగా నిలిచాయని ఆయన అన్నారు.