'ఆర్ డి ఎక్స్ లవ్' సినిమా 'ఆర్ ఎక్స్ 100'కి సీక్వెల్ కాదు: పాయల్ రాజ్ పుత్
- 'ఆర్ ఎక్స్ 100'తో మంచి క్రేజ్
- వరుసగా వస్తోన్న అవకాశాలు
- 'ఆర్ డి ఎక్స్ లవ్ ' జోనర్ వేరు
ఈ సినిమా ద్వారా భానుశంకర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఈ సినిమా 'ఆర్ ఎక్స్ 100' సినిమాకి సీక్వెల్ అనే ప్రచారం జోరందుకుంది. దాంతో ఈ విషయంపై పాయల్ స్పందిస్తూ .. 'ఆర్ డి ఎక్స్ లవ్ ' నాయికా ప్రాధాన్యత కలిగిన చిత్రమని చెప్పింది. ఈ సినిమాకి .. 'ఆర్ ఎక్స్ 100' సినిమాకి ఎక్కడా ఎలాంటి పోలికలు ఉండవని అంది. 'ఆర్ డి ఎక్స్ లవ్ ' పూర్తిగా వేరే జోనర్లో వుంటుందని స్పష్టం చేసింది.