షాహిద్ ఆఫ్రిదీకి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన గౌతం గంభీర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షాహిద్ ఆఫ్రిదీకి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన గౌతం గంభీర్

  • గంభీర్ కు వ్యక్తిత్వం లేదన్న ఆఫ్రిదీ
  • ఆఫ్రిది ఒక వింత మనిషి అన్న గంభీర్
  • మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళతానంటూ వ్యాఖ్య
తన ఆటోబయోగ్రఫీ 'గేమ్ ఛేంజర్'లో పాక్ మాజీ క్రికెటర్ పలు సంచలన, వివాదాస్పద అంశాలను పేర్కొన్న సంగతి తెలిసిందే . తన అసలు వయసు ఎంతో చెప్పడంతో పాటు, వివాదాస్పద కశ్మీర్ అంశాన్ని కూడా పుస్తకంలో లేవనెత్తాడు. ఇదే సమయంలో భారత మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతం గంభీర్ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. గంభీర్ కు ఒక వ్యక్తిత్వం అంటూ లేదని, అత్యున్నతమైన క్రికెట్ లో గంభీర్ ఒక క్యారెక్టర్ మాత్రమే అని అన్నాడు. గంభీర్ పేరిట ఒక రికార్డు కూడా లేదని ఎద్దేవా చేశాడు. కేవలం తన ప్రవర్తనతోనే వార్తల్లో నిలుస్తుంటాడని విమర్శించాడు.

ఈ నేపథ్యంలో ఆఫ్రిదీపై గంభీర్ విరుచుకుపడ్డాడు. ఆఫ్రిది ఒక వింత మనిషి అని అన్నాడు. మెడికల్ టూరిజంలో భాగంగా పాకిస్థానీలకు భారత్ ఇప్పటికీ వీసాలు జారీ చేస్తోందని... నిన్ను స్వయంగా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళతానని ట్వీట్ చేశాడు. అంతే కాదు ఈ ట్వీట్ ను ఆఫ్రిదీకి ట్యాగ్ చేశాడు.
gambhir
afridi
cricket

More Telugu News