షికారు చేస్తున్న పుకార్లు .. క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్
- పూజా హెగ్డే పారితోషికం వార్తలో నిజం లేదు
- నా తదుపరి సినిమాను పవన్ తో చేయడం లేదు
- అధికారిక ప్రకటన చేసేవరకూ వేచి వుండండి
ఇక ఈ సినిమా తరువాత హరీశ్ శంకర్ తదుపరి సినిమా పవన్ కల్యాణ్ తో ఉండనున్నట్టుగా కూడా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఒక నిర్మాత నుంచి గతంలో అడ్వాన్స్ తీసుకున్న పవన్, ఆయనకి ఆ సినిమా చేసి పెట్టనున్నాడనీ .. ఆ సినిమాకి దర్శకుడు హరీశ్ శంకర్ అని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై కూడా హరీశ్ శంకర్ స్పందిస్తూ, ఇది కూడా పుకారు మాత్రమేనని స్పష్టం చేశాడు. తన సినిమాలకి సంబంధించిన వివరాల కోసం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పాడు.