సైకిల్ గుర్తుకే ఓటేయాలన్న మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి.. విస్తుపోయిన టీఆర్ఎస్ శ్రేణులు!
- బొమ్మలరామారం ఎన్నికల ప్రచారంలో ఘటన
- కుమారుడి తరఫున ఉమ ప్రచారం
- వెంటనే తేరుకుని కారుకు ఓటేయాలని కోరిన టీఆర్ఎస్ నేత
ఈ నేపథ్యంలో కుమారుడి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమా, సైకిల్ గుర్తుకే ఓటేయాలని కోరారు. దీంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా విస్తుపోయారు. వెంటనే తేరుకున్న ఉమామాధవరెడ్డి కారు గుర్తుకే ఓటేయాలని కవర్ చేశారు. దీంతో టీడీపీని వీడినా, ఇంకా పాత అలవాట్లు పోలేదని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.