పెళ్లి సందడిలో అదుపుతప్పిన టాటా ఏస్ వాహనం.. ఒకరి మృతి
- మరో ఇద్దరికి గాయాలు
- ఆగివున్న వాహనాన్ని నడిపేందుకు ప్రయత్నించిన బాలుడు
- బ్యాండ్ బృందంపైకి దూసుకుపోయిన వాహనం
అదే సమయంలో ఓ టాటా ఏస్ వాహనం వచ్చి అక్కడ ఆగింది. డ్రైవర్ ఇంజిన్ ఆన్‌లోనే ఉంచి ఏదో కొనేందుకు సమీపంలోని పాన్‌షాప్‌లోకి వెళ్లాడు. దీన్ని గమనించిన ఓ బాలుడు సరదాతో వాహనంలోకి ఎక్కి హ్యాండ్ బ్రేక్ తీసి, ఏక్సిలేటర్పై కాలు వేయడంతో బండి ముందుకు దూసుకుపోయింది. ఆ సమయానికి వాహనం ముందు బ్యాండ్ బృందం ఉండడంతో వారిని ఢీకొట్టుకుంటూ వాహనం వెళ్లింది.
ఈ హఠాత్పరిణామంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వాహనం ముగ్గురి పైనుంచి దూసుకు వెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.