భారత ఫొటో జర్నలిస్టును అరెస్ట్ చేసిన శ్రీలంక

ఢిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్టర్ సండే  పేలుళ్ల అనంతర పరిణామాలకు సంబంధించిన వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఓ స్కూల్‌లోకి వెళ్లాడంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

సిద్దిఖి అహ్మద్ డానిష్ ఢిల్లీలో రాయటర్స్‌ న్యూస్ ఏజెన్సీలో ఫొటో జర్నలిస్ట్. ఉగ్రదాడుల అనంతరం పరిణామాలను ఫొటోల్లో బంధించేందుకు ఇటీవల ఆయన శ్రీలంక వెళ్లారు. నెగొంబోలోని ఓ స్కూలు అధికారులతో మాట్లాడేందుకు ఆయన బలవంతంగా లోపలికి వెళ్లాడని ఆరోపిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నెగొంబో మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. ఈ నెల 15 వరకు మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించినట్టు తెలిపారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన ఉగ్రదాడిలో ఓ స్కూలు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు సిద్దిఖీ స్కూలులోకి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి సిద్దిఖీని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
Go Back to Shorts
Sri Lanka
terror attack
photo journalist
Reuters news agency
Siddiqui Ahamad Danish

More Telugu News