మనిషిలా ప్రవర్తిస్తున్న ఆవుదూడ.. తమిళనాడులో విచిత్రం.. చూసేందుకు జనాల క్యూ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మనిషిలా ప్రవర్తిస్తున్న ఆవుదూడ.. తమిళనాడులో విచిత్రం.. చూసేందుకు జనాల క్యూ

  • తలకింద దిండుపెట్టుకుని పడుకుంటున్న దూడ
  • చిరుతిళ్లు తింటున్న వైనం
  • పాటలకు డ్యాన్స్
సృష్టిలో విచిత్రాలకు కొదవలేదు. ప్రపంచంలో రోజూ ఏదో ఓ చోట ఇవి జరుగుతూనే ఉంటాయి. అయితే, వెలుగులోకి వచ్చేవి మాత్రం కొన్నే. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం అంతకంటే విచిత్రం. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరులో ఓ ఆవుదూడ ప్రవర్తిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది అచ్చం మనిషిలా ప్రవర్తిస్తోంది.

నిత్యం ఇంట్లోనే తిరుగుతూ కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోతోంది. దిండుపై తలపెట్టి కునుకు తీస్తోంది. పిల్లల కోసం తీసుకొచ్చే చిరుతిళ్లను తింటోంది. పాటలు వింటూ సంగీతానికి అనుగుణంగా నాట్యం చేస్తోంది. ఇంట్లోని నీళ్లే తాగుతోంది. రోజంతా ఇంట్లోనే ఉంటున్న ఈ దూడ ఆకలి వేసినప్పుడు మాత్రం తల్లి వద్దకు వెళ్లి పాలుతాగుతోంది. ఆంబూరు సమీపంలోని వీరంగుప్పంలో ఆనందన్ అనే వ్యక్తి పెంచుకుంటున్న ఈ దూడ వింత ప్రవర్తన గురించి తెలియడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. దానిని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
calf
cow
Tamil Nadu

More Telugu News