మా నాన్నకు .. నాకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు: అల్లు అర్జున్
- మా అమ్మానాన్నలతోనే ఉంటున్నాను
- నాన్న .. నేను సరదాగా మాట్లాడుకుంటాము
- మేమంతా హ్యాపీగా వున్నాము
తాజా ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను నా భార్యా బిడ్డలతో కలిసి మా అమ్మానాన్నలతోనే ఉంటున్నాను. ప్రతిరోజు మా నాన్న .. నేను కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటాము. మా మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్టుగా వచ్చిన పుకార్లను వినేసి మేము నవ్వుకున్నాము. మా నాన్నకి .. నాకు మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదు. మేమంతా చాలా సంతోషంగా వున్నాము" అని చెప్పుకొచ్చాడు.