సిద్ధూపై ఎన్నికల సంఘం సీరియస్.. రేపు సాయంత్రం 6 లోపు వివరణ ఇవ్వాలని నోటీస్
- మోదీ ఒక అబద్ధాల కోరు
- చౌకీదార్ దొంగలను తయారు చేస్తున్నారు
- మహాత్ముని గడ్డపై మోదీ కనపడటం దురదృష్టకరమన్న సిద్ధూ
మహాత్ముడు నడయాడిన గడ్డపై అతిపెద్ద అబద్ధాల కోరైన మోదీ కనబడుతుండటం దురదృష్టకరమని సిద్ధూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత నీరజ్, ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో సిద్ధూ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నేడు ఈసీ నోటీసు జారీ చేసింది. రేపు సాయంత్రం 6 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.