Narendra Modi: గడ్చిరోలి ఘటనలో జవాన్లు మరణించడంపై ప్రధాని మోదీ స్పందన

మహారాష్ట్రలో మావోలు మరోసారి రెచ్చిపోయిన నేపథ్యంలో 16 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలికావడం యావత్ దేశాన్ని నిశ్చేష్టకు గురిచేసింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఆవేశంగా స్పందించారు. ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, జవాన్ల ప్రాణాలను బలిగొన్నవాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దాడిని ఖండించిన మోదీ, విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన అమరజవాన్లకు వందనం చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలు చిరకాలం గుర్తుంచుకుంటామని చెబుతూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. హింసకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని మోదీ పునరుద్ఘాటించారు.
Narendra Modi

More Telugu News