అనాథ పిల్లలతో కలిసి ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా చూసిన సాయి ధరమ్ తేజ్!
- హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో చూసిన నటుడు
- పిల్లలంతా సినిమాను ఎంజాయ్ చేశారని వ్యాఖ్య
- వారందరికీ తలో మొక్కను అందజేస్తున్నామని వెల్లడి
ఈ విషయంలో తాను చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ఈ పిల్లలకు సామాజిక బాధ్యత తెలియజేయాలన్న ఉద్దేశంతో వాళ్లందరికి చిన్నచిన్న మొక్కలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ పిల్లలు సినిమా చూసేందుకు సహకరించిన మేనేజ్ మెంట్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.