నిద్రిస్తున్న యువతిపై అత్యాచారం...ఆస్ట్రేలియా యువ క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
- సహచరుడి ప్రియురాలిని రేప్ చేసిన అలెక్స్ హెప్బర్న్
- కౌంటీ క్రికెట్ సందర్భంగా ఇంగ్లండ్‌లో 2017లో ఘటన
- నేరం నిర్థారించి హెర్ఫోర్డ్ క్రౌన్ కోర్టు ఈ మేరకు తీర్పు
తాను నిద్రపోతుండగా అలెక్స్ తనపై అత్యాచారం చేశాడని, తొలుత తాను తన ప్రియుడు జో క్లార్క్ అనుకున్నానని, గొంతు గుర్తుపట్టిన తర్వాతే అది అలెక్స్ అని అర్థమయిందని కోర్టులో విచారణ సందర్భంగా బాధితురాలు తెలిపింది. అయితే ఆమె తనతో ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొందని అలెక్స్ కోర్టుకు చెబుతూ వచ్చాడు. ఇద్దరి వాదనలు విన్న కోర్టు అలెక్స్ తప్పుడు వాదన చేస్తున్నాడని నిర్థారించి ఈ మేరకు తీర్పు చెప్పింది.