రాహుల్‌కు క్షమాపణలు చెప్పేందుకు అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు

  • ప్రధానిని చౌకీదార్ చోర్ అంటూ రాహుల్ వ్యాఖ్యలు
  • సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన మీనాక్షి లేఖీ
  • తామెక్కడా ఆ వ్యాఖ్యలు చేయలేదన్న సుప్రీం
సుప్రీంకోర్టు ఇటీవల రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 10న ఉత్తర్వులిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధానమంత్రిని చౌకీదార్ చోర్ అని పేర్కొన్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేత మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన సుప్రీంకోర్టు రాఫెల్ తీర్పులో తామెక్కడా ఆ వ్యాఖ్యలు చేయలేదని, కాబట్టి దానిపై వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది.

దీనిపై ఏప్రిల్ 22న రాహుల్ అఫిడవిట్ దాఖలు చేశారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే విచారం అనే మాటను బ్రాకెట్‌లో ఉంచారంటూ మీనాక్షి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై తాను క్షమాపణలు చెబుతానని రాహుల్ తెలిపారు. ఈ విషయాన్ని నేడు సుప్రీంకోర్టుకు రాహుల్ తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వెల్లడించారు. దీంతో క్షమాపణలతో కూడా అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు కోర్టు రాహుల్‌కు మరో అవకాశం కల్పించింది.
Go Back to Shorts
Rafel
Narendra Modi
Rahul Gandhi
Supreme Court
Meenakshi Lekhi

More Telugu News