బీజేపీకి ప్రచారం చేస్తోందట... శునకాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు!
- మహారాష్ట్రలో శునక ప్రచారం
- పోలీసులను ఆశ్రయించిన మిగతా పార్టీలు
- శునకం యజమానిపైనా కేసు
ఏక్ నాథ్ మౌతీరాం అనే వ్యక్తి, తన పెంపుడు కుక్కపై బీజేపీ అనుకూల స్టిక్కర్లను అతికించి, పోలింగ్ రోజు దాన్ని బయటకు తీసుకువచ్చాడు. "మోదీకి ఓటేయండి, దేశాన్ని కాపాడండి" అన్న నినాదాన్ని కూడా దాని ఒంటిపై రాశాడు. ఇక రోడ్డుపై కుక్క ప్రచారాన్ని చూసిన ఇతర పార్టీల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన చర్యలు ఉన్నాయని తేల్చిన పోలీసులు ఏక్ నాథ్ పై కేసు పెట్టి, ఆ కుక్కను కూడా స్టేషన్ కు తరలించారు. దాని ఆలనా, పాలనా తాము చూడలేమని, వెంటనే ఈ శునకాన్ని తీసుకెళ్లాలని మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందికి పోలీసులు సూచించారు.