కేజ్రీవాల్ భార్యకు రెండు ఓటరు కార్డులున్నాయి.. ఫిర్యాదు చేసిన బీజేపీ
- ఉత్తరప్రదేశ్‌లోని షహీబాబాద్, ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో సునీత కేజ్రీవాల్‌కు ఓట్లు
- గంభీర్‌పై కాంగ్రెస్ ఫిర్యాదుకు బీజేపీ ప్రతీకారం
- తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు
బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్‌కు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఒకటి, కరోల్‌బాగ్‌లో మరో ఓటరు కార్డు ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి మార్లేనా ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత బీజేపీ ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. గంభీర్‌పై ఇదే కోర్టులో అతిషి క్రిమినల్ కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అదే కోర్టులో ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.