Shraddha Kapoor: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • యూరప్ లో సాహో పాట చిత్రీకరణ 
  • టీవీ షోకి ఓకే చెప్పిన వెంకీ!
  • కెన్యాలో మొదలైన '96' షూటింగ్   
*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రానికి సంబంధించి ముంబైలో చేస్తున్న యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ పూర్తికావచ్చింది. త్వరలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటపై ఓ పాటను చిత్రీకరించడానికి యూనిట్ యూరప్ వెళుతోంది.
*  తెలుగు రియాలిటీ టీవీ షో 'బిగ్ బాస్ -3'కి హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారన్న విషయమై ఇప్పటివరకు పలువురి పేర్లు ప్రచారంలో వున్నాయి. అయితే, తాజాగా వెంకటేశ్ పేరు తెరమీదకు వచ్చింది. హోస్ట్ గా వెంకటేశ్ దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు.
*  శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మిస్తున్న '96' రీమేక్ షూటింగ్ నిన్నటి నుంచి కెన్యాలో జరుగుతోంది. ఇందులో శర్వా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలను కెన్యాలో చిత్రీకరిస్తున్నారు.
Shraddha Kapoor
Prabhas
Venkatesh
Samantha

More Telugu News