Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐదేళ్లు ఐటీ మంత్రిగా చేసి గ్లోబరినా తెలియదంటావా? పెద్దమ్మ గుడి వద్దకు వచ్చి ప్రమాణం చేయగలవా?: కేటీఆర్ కు సవాల్ విసిరిన వీహెచ్

  • మంగళవారం 12 గంటలకు రావాలి
  • ప్రమాణం చేయకపోతే గ్లోబరినాతో సంబంధం ఉందని ఒప్పుకున్నట్టే
  • గ్లోబరినా తెలియదనడం పచ్చి అబద్ధం
తాను ఇంతవరకు గ్లోబరినా పేరే వినలేదని కేటీఆర్ చెప్పడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. గ్లోబరినా కంపెనీ పేరు వినలేదని కేటీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే పెద్దమ్మ తల్లిపై ప్రమాణం చేసి గ్లోబరినా తనకు తెలియదని చెప్పాలని సవాల్ విసిరారు.

"కేటీఆర్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పెద్దమ్మ గుడికి రావాలి, అక్కడికొచ్చి అమ్మవారిపై ప్రమాణం చేయాలి, ఆ విధంగా చేయలేకపోతే కేటీఆర్ కు గ్లోబరినా సంస్థతో ఒప్పందం ఉన్నమాట నిజమే అని ఒప్పుకున్నట్టే" అని స్పష్టం చేశారు. ఐదేళ్లపాటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు గ్లోబరినా తెలియదనడం హాస్యాస్పదంగా ఉందున్నారు.
KTR
VH

More Telugu News