కేఏ పాల్ ను ఇంటికి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు!
- శ్రీలంకలో శాంతిని నెలకొల్పేందుకు వెళ్లిన కేఏ పాల్
- సునామీ వచ్చినప్పుడు శ్రీలంకకు భారీ సాయం చేసిన పాల్
- పాల్ సాయాన్ని గుర్తుంచుకున్న రాజపక్స
శ్రీలంకలో ఉగ్రదాడి తర్వాత అక్కడ శాంతిని నెలకొల్పేందు కేఏ పాల్ అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా పాల్ ను శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ఆయన పాత స్నేహితుడు మహీంద రాజపక్స తన నివాసానికి ఆహ్వానించారు. పాల్ కు అతిథి మర్యాదలు చేశారు. గతంలో సునామీ కకావికలం చేసినప్పుడు ఆ దేశానికి పాల్ తన ఛారిటీ నుంచి భారీ సాయాన్ని అందజేశారు. ఈ సాయాన్ని రాజపక్స గుర్తుంచుకున్నారు. మరోవైపు, తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా శ్రీలంక నుంచి పాల్ స్పందించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.