మా నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు.. ఆగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి!: మంత్రి జవహర్ హెచ్చరిక
- మీ పార్టీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి
- వైసీపీ ఎమ్మెల్యే రక్షనిధికి సూచించిన జవహర్
- తిరువూరులో మీడియాతో టీడీపీ నేత
వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని జవహర్ మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.