ఈసారి బౌద్ధ మందిరాలే ఉగ్రవాదుల టార్గెట్: శ్రీలంక ఇంటెలిజెన్స్ కు సమాచారం
- బౌద్ధులు ధరించే దుస్తులను కొనుగోలు చేసిన ముస్లిం మహిళ
- బౌద్ధులుగా మందిరాల్లోకి ప్రవేశించి పేలుళ్లకు ప్లాన్
- భయాందోళనలో శ్రీలంక ప్రజలు
మార్చి 30వ తేదీన ఒక ముస్లిం మహిళ బౌద్ధులు ధరించే తొమ్మిది దుస్తులను రూ. 29వేల శ్రీలంక కరెన్సీతో కొనుగోలు చేసిందని అధికారులు తెలిపారు. గిరియుల్లా టెక్స్ టైల్ పార్కులో ఈ వస్త్రాలను కొనుగోలు చేసిందని చెప్పారు. ఈ వస్త్రాలు ధరించి, బౌద్ధులుగా బౌద్ధ మందిరాల్లోకి ప్రవేశించి, పేలుళ్లకు పాల్పడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. తాజా సమాచారంతో శ్రీలంక ప్రజలు హడలిపోతున్నారు.