Andhra Pradesh: ఒక్కసారిగా కూలిన మట్టిపెళ్లలు.. తునిలో శిథిలాల కింద ఇద్దరు కార్మికులు!
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. తునిలోని తాండవ నదిలో కార్మికులు మట్టిని తవ్వుతుండగా, ఒక్కసారిగా మట్టి పెళ్లలు విరిగి మీద పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు శ్రీనివాసకుమార్, సత్తిబాబు అనే ఇద్దరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాగా, శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.