ఆరేళ్ల బాలికను చంపి అత్యాచారం.. నిందితుడిని పట్టించిన అతడి ఏడేళ్ల కుమారుడు

  • ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని తీసుకెళ్లి ఘోరం
  • బాలికను తన తండ్రే తీసుకెళ్లాడన్న కుమారుడు
  • ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఘటన
ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల అమ్మాయిని పొలాల్లోకి తీసుకెళ్లి హత్య చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడిన కిరాతకుడిని అతడి ఏడేళ్ల కుమారుడే పోలీసులకు పట్టించాడు. ఉత్తరాఖండ్‌‌లోని హరిద్వార్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు ఓ రోజువారీ కూలి. తన పొరిగింట్లో ఉండే ఆరేళ్ల చిన్నారి ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని చెట్టు వద్దకు తీసుకెళ్లి హత్యచేశాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చుట్టుపక్కల పిల్లలను ప్రశ్నించినప్పుడు నిందితుడి ఏడేళ్ల కుమారుడు కీలక సమాచారాన్ని పోలీసులకు అందించాడు. తామందరం కలిసి ఆడుకుంటున్నప్పుడు తన తండ్రి బాలికను ఆట మధ్యలోంచి తీసుకెళ్లాడని చెప్పాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జనమేజయ ఖండూరీ తెలిపారు.
Go Back to Shorts
Uttarakhand
Haridwar
children
Murder
rape

More Telugu News