పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తున్న యువకుడికి నిప్పంటించిన బాలిక
- తొమ్మిదో తరగతి బాలికను ప్రేమించిన నిషాద్
- బాలిక తల్లిదండ్రులకు కూడా విషయాన్ని వివరించాడు
- పెళ్లీడు రాగానే పెళ్లి చేస్తామన్న బాలిక తల్లిదండ్రులు
ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు కూడా తెలిపాడు. దీంతో బాలికకు పెళ్లీడు రాగానే నిషాద్కి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. అయినప్పటికీ నిషాద్ వినకుండా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో నిషాద్కు బుద్ధి చెబుదామని ఆ బాలిక అగ్గిపుల్ల గీసి అతనిపై విసిరేసింది. ప్రస్తుతం 60 శాతం కాలిన గాయాలతో ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం తల్లీకూతుళ్లు అక్కడి నుంచి పారిపోయారని నిషాద్ చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.