విజయసాయికి పలుమార్లు ఛాలెంజ్ చేశాను!: దేవినేని ఉమ

  • దమ్ముంటే పోలవరంపై చర్చకు రావాలి
  • ఇప్పటికే పలుమార్లు ఛాలెంజ్ చేశా
  • ఈసీ పోలవరంపై సమీక్షను కూడా అడ్డుకుంది
వైసీపీ అధినేత జగన్‌పై పందేలు కట్టిన వాళ్లంతా ఇప్పుడు డబ్బు వెనక్కి తీసుకుంటున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే పోలవరంపై చర్చకు రావాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ఈ విషయమై విజయసాయికి ఛాలెంజ్ చేశానని గుర్తు చేశారు.

మరోవైపు ఎన్నికల కమిషన్ పోలవరం ప్రాజెక్టుపై సమీక్షను కూడా అడ్డుకుందని ఉమ మండిపడ్డారు. కొండను తవ్వడం వల్ల మట్టి కదిలి భూమికి పగుళ్లు వచ్చి, స్పిల్‌వేకు మూడు కిలో మీటర్లలో మట్టి కుంగితే వైసీపీ దానిపై కూడా దుష్ప్రచారం చేస్తోందన్నారు. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా జూలైలో నీళ్లిస్తామని దేవినేని ఉమ ప్రకటించారు.
Go Back to Shorts
Jagan
Devineni Uma
Vijayasai Reddy
Polavaram
Election Commission

More Telugu News