గుంటూరులో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరి దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు!
- వేగంగా వెళుతూ అదుపుతప్పిన బస్సు
- గుంటూరు నుంచి నరసరావుపేటకు వెళుతుండగా ఘటన
- క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం స్థానికుల సాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. ఈ బస్సు గుంటూరు నుంచి నరసరావుపేటకు వెళుతోందని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.