20 కిలోల బరువు తగ్గాలని బాలకృష్ణ సంచలన నిర్ణయం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

20 కిలోల బరువు తగ్గాలని బాలకృష్ణ సంచలన నిర్ణయం!

  • బాలయ్య కోసం స్టోరీ రెడీ చేసిన బోయపాటి
  • నచ్చేయడంతో బరువు తగ్గాలని భావిస్తున్న బాలయ్య
  • రవికుమార్ తో సినిమా తరువాత బోయపాటి చిత్రం
తన బరువును కనీసం 20 కిలోలను తగ్గించుకోవాలని హీరో నందమూరి బాలకృష్ణ నిర్ణయించుకున్నారట. ఇందుకు కారణం లేకపోలేదు. బాలకృష్ణకు 'సింహా', 'లెజండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన బోయపాటి, బాలయ్యతో తదుపరి కమిట్ అయిన సినిమా కోసం బరువు తగ్గక తప్పదట. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేసి, బరువు తగ్గుతానని అన్నారట.

ఇక బరువు తగ్గాలంటే కనీసం 3 నెలల సమయం అవసరం కాబట్టి, ఈ లోగా దర్శకుడు కేఎస్ రవికుమార్ తో సినిమాను చేద్దామని నిర్ణయించుకుని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ చిత్రాన్ని త్వరగా ముగిస్తానని, ఆ వెంటనే బరువు తగ్గి బోయపాటి చిత్రం షూటింగ్ కు వచ్చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి బాలయ్యతో ఓ పొలిటికల్ థ్రిల్లర్ తీద్దామని బోయపాటి అనుకోగా, ఎన్నికలు ముగిసినందున రాజకీయ నేపథ్యమున్న సినిమా వద్దని, మరో కథతో రావాలని బాలకృష్ణ చెప్పగా, బోయపాటి తన వద్ద ముందుగానే సిద్ధం చేసుకున్న కథను చెప్పారట. అది బాగా నచ్చేయడంతో, బాలకృష్ణ ఓకే చెప్పేశారు. అయితే, ఆ సినిమా కథకు అనుగుణంగా బాలయ్య బరువు తగ్గాల్సివుంది. దానికి సరేనన్న బాలయ్య, ఇప్పుడు కసరత్తులు చేసి బరువు తగ్గి, రవికుమార్ సినిమా తరువాత బోయపాటితో సెట్స్ మీదకు వెళ్తారని సమాచారం.
Balakrishna
Weight
Boyapati Sreenu
New Movie

More Telugu News