తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ
- ఫిరాయింపుదార్లు పదవులకు రాజీనామా చేయలేదు
- విలీనంపై వాళ్లే ప్రకటన చేస్తున్నారు
- విలీనంపై రాష్ట్ర కాంగ్రెస్ కు హక్కులేదు
పార్టీ మారిన ఎమ్మెల్యేలే సీఎల్పీ విలీనంపై ప్రకటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగానికి సీఎల్పీ విలీనం చేసే హక్కులేదని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సీఎల్పీ విలీనానికి సంబంధించిన అంశాన్ని కేవియట్ గా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, సీఎల్పీ విలీనం అనేది స్పీకర్ పరిధిలోని అంశం కాదని, ఈ విషయంలో గతంలో సుప్రీం కోర్టు అనేక తీర్పులు కూడా ఇచ్చిందని ఆయన ప్రస్తావించారు.