విపక్షాలన్నా, విమర్శలన్నా మోదీకి చాలా భయం: ప్రియాంకా గాంధీ
- మోదీ ఒక బలహీనమైన ప్రధాని
- మోదీ సర్కార్ అత్యంత బలహీనం
- ప్రజా తీర్పుతోనే అధికారం
మోదీ సొంత నియోజకవర్గంలో అభివృద్ధిని తాను చూడలేదన్నారు. మోదీని ప్రధాన ప్రచార మంత్రిగా అభివర్ణించిన ప్రియాంక, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి రోడ్లను శుభ్రం చేస్తూ బీజేపీ నేతలు తాగునీటిని వృధా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా బుందేల్‌ఖండ్‌లో ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు, పంటలు సైతం కరవు కోరల్లో చిక్కుకున్నాయని ప్రియాంక పేర్కొన్నారు.