పాక్ ఓ బుల్లెట్ కాలిస్తే.. మేం ఫిరంగి గుండుతో జవాబిస్తాం!: బీజేపీ చీఫ్ అమిత్ షా హెచ్చరిక
- మళ్లీ గెలిస్తే ఆర్టికల్ 370ను రద్దుచేస్తాం
- కశ్మీర్ ను విడగొట్టాలన్న పాక్ కల నెరవేరదు
- జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో పాక్ ఉగ్రసంస్థలు భారత్ ను లక్ష్యంగా చేసుకునేవని తెలిపారు. భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయాలన్న పాక్ కల ఎన్నటికీ నెరవేరదన్నారు. ‘పాకిస్థాన్ నుంచి ఓ తూటా భారత్ వైపు వస్తే.. భారత్ నుంచి ఓ ఫిరంగి గుండు పాక్ కు వెళుతుంది’ అని హెచ్చరించారు.