Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్లో మరో ఛాన్స్ పట్టేసిన ప్రియా వారియర్

  • ప్రియా వారియర్ కి మంచి క్రేజ్ 
  • తాజా చిత్రంగా 'శ్రీదేవి బంగ్లా'
  • తదుపరి సినిమాగా 'లవ్  హ్యాకర్స్'
తన తొలి సినిమా 'ఒరు ఆదార్ లవ్' విడుదలకి ముందే ప్రియా వారియర్ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. 'ఒరు ఆదార్ లవ్' సినిమా పరాజయం పాలైనప్పటికీ, ప్రియా వారియర్ క్రేజ్ పై అది అంత ప్రభావం చూపలేకపోయింది. ఈ కారణంగానే ప్రియా వారియర్ కి మరో బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ఆమె 'శ్రీదేవి బంగ్లా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ప్రియా వారియర్ ను వెతుక్కుంటూ మరో అవకాశం వచ్చింది. మయాంక్ ప్రకాశ్ శ్రీవాత్సవ దర్శకత్వంలో 'లవ్ హ్యాకర్స్' అనే సినిమా రూపొందనుంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఢిల్లీ .. లక్నో .. గుర్గావ్ .. ముంబైలలో ఈ సినిమా షూటింగు జరుగుతుంది. ఈ సినిమా ఛాన్స్ రావడం పట్ల ప్రియా వారియర్ ఫుల్ ఖుషీ అవుతోంది. 
priya varrier

More Telugu News