వేములవాడ రూరల్ లో ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!

  • జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ లేదు
  • హైకోర్టును ఆశ్రయించిన వేములవాడ ఎంపీపీ
  • ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండల పరిధిలో ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా ప్రాతిపదికన జరగటం లేదని, ఈ విషయమై పున: పరిశీలించాలని కోరుతూ వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వేములవాడ రూరల్ లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ స్టే విధించింది.
Go Back to Shorts
Rajanna Sircilla District
vemulavada
mptc
elections

More Telugu News