వాస్తవాలను విజయసాయిరెడ్డి చాలా ఆలస్యంగా గుర్తించారు: కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రామాంజనేయులు
- రాయలసీమ కరవుసీమగా మారడానికి వైయస్, జగనే కారణం
- వైయస్ పై సీమ ప్రజల్లో కోపం ఉంది
- విజయసాయి అసహనంతో టీడీపీపై బురద చల్లుతున్నారు
రాయలసీమ కరవుసీమగా ఉండటానికి దివంగత రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగనే కారణమని కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రామాంజనేయులు అన్నారు. రాయలసీమకు రాజశేఖరరెడ్డి ఏమీ చేయలేదనే కోపం సీమ ప్రజల్లో ఉందని చెప్పారు. సీమకు నీరు ఇచ్చి పంటలను కాపాడిన చంద్రబాబుకు ఎన్నికల్లో అక్కడి ప్రజలు నీరాజనం పలికారని తెలిపారు.
కడప జిల్లాలో టీడీపీ ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పారు. ఓడిపోతామని తెలిసే, వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు వైసీపీ వైపు పందేలు కాసినవారు కూడా... ఇప్పుడు టీడీపీ గెలుస్తుందని పందేలు కాస్తున్నారని చెప్పారు. వాస్తవాలను చాలా ఆలస్యంగా విజయసాయిరెడ్డి గుర్తించారని, అందుకే అసహనంతో టీడీపీపై బురద చల్లుతున్నారని అన్నారు.