జయలలిత ఇంటిని జప్తు చేశాం: హైకోర్టుకు తెలిపిన ఐటీ శాఖ
- జయలలిత పన్ను బకాయి ఉన్నారు
- ఆమెకు చెందిన కొన్ని ఆస్తులను జప్తు చేశాం
- జయ ఆస్తుల నిర్వహణకు కమిటీని కోరడం సరికాదు
ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి చెన్నై ఐటీ అధికారులు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. పోయస్ గార్డెన్ లోని జయ ఇల్లు వేద నిలయంతో పాటు ఆమె ఆస్తులను జప్తు చేసినట్టు అందులో పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ ప్రకారం జయకు రూ. 16.37 కోట్ల విలువైన స్థలం, కారు, బ్యాంక్ లో రూ. 10 కోట్లు ఉన్నాయి.
అయితే, 1990 నుంచి 2012 వరకు జయ పన్ను చెల్లించలేదు. ఇదే విధంగా 2005-06 నుంచి 2011-12 వరకు రూ. 6.62 కోట్ల పన్ను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో వేద నిలయంతో పాటు హైదరాబాదులో ఉన్న ఇల్లు, మరో మూడు ఆస్తులు జప్తు చేశామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఐటీ అధికారులు తెలిపారు. రూ. వెయ్యి కోట్ల విలువ ఉండే జయ ఆస్తుల నిర్వహణకు ప్రత్యేక కమిటీ వేయాలని కోరడం సరికాదని అన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.