సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'బిగ్ బాస్ 3' హోస్ట్ గా అనుష్క?
- దేవినేని పాత్రలో తారకరత్న
- 'లక్ష్మీ బాంబ్'గా మారుతున్న 'కాంచన'
* విజయవాడకు చెందిన దివంగత టీడీపీ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత కథ తెరకెక్కుతోంది. శివనాగు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. నిన్ననే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.
* గతంలో తెలుగులో వచ్చిన 'కాంచన' హిట్ చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'లక్ష్మీ బాంబ్' అనే టైటిల్ని నిర్ణయించారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.