దాచుకున్న దోపిడీ సొమ్ము కోసమే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లింది: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
- ఏపీలో ఏం జరిగినా రాబందుల్లా వైసీపీ వాళ్లు వస్తారు
- తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడరే?
- టీటీడీ బంగారం వ్యవహారంపై రాజకీయం తగదు
ఏపీలో ఏం జరిగినా రాబందుల్లా బయటకొచ్చే వైసీపీ వాళ్లు, తెలంగాణలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై నోరు మెదపట్లేదని, విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడట్లేదని విమర్శించారు. టీటీడీ బంగారం వ్యవహారాన్ని కూడా వైసీపీ రాజకీయం చేస్తోందని, దేవుడ్ని కూడా రాజకీయానికి వాడుకునే పార్టీ వైసీపీ అని దుమ్మెత్తిపోశారు.