Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ సక్సెస్ నేపథ్యంలో.. కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పిన హరీశ్ రావు

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ 6లోని మోటార్ పంపు వెట్ రన్ ను ఈరోజు విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఈ మోటార్ ను ప్రారంభించారు. దీంతో నీళ్లు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సాగునీటిశాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. ఈ ప్రాజెక్టు వెట్ రన్ ను విజయవంతంగా నిర్వహించిన ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. అలాగే ఈ శుభ సందర్భాన తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు హరీశ్ రావు ట్విట్టర్ లో స్పందించారు.
Telangana
KALESWARAM PROJECT
wishes
Twitter
Harish Rao
wet run

More Telugu News