359కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య.. మరో 18 మంది అరెస్ట్

ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో చోటు చేసుకున్న వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 359కి చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారిలో 38 మంది విదేశీయులు ఉన్నారు. మరణించిన వారిలో 10 మంది భారతీయులు ఉన్నట్టు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.

మరోవైపు, మరిన్ని పేలుళ్లకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే వార్తలు శ్రీలంకను వణికిస్తున్నాయి. మరోవైపు, పేలుళ్లకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న రాత్రి కూడా మరో 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 58 కి చేరుకుంది.
Go Back to Shorts
Sri Lanka
death toll
blast

More Telugu News