మద్యం తాగి వీడియో కాల్ మాట్లాడుతూ ఉరేసుకున్న యువకుడు

  • తమాషా చేస్తున్నాడని భావించిన స్నేహితుడు
  • చూస్తుండగానే చనిపోయిన యువకుడు
  • తిరుపతిలోని దామినేడులో ఘటన
మద్యం మత్తులో స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడుతూ ఓ యువకుడు ఉరేసుకున్నాడు. తిరుపతిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. దామినేడుకు చెందిన శివకుమార్ (26) మెకానిక్. ఆదివారం సెలవు కావడంతో మద్యం తాగాడు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న శివకుమార్ స్నేహితుడికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు.

కాసేపటి తర్వాత తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పాడు. తానెలా ఉరేసుకుంటానో చూడాలని చెప్పడంతో స్నేహితుడు తమాషా చేస్తున్నాడని భావించి లైట్‌గా తీసుకున్నాడు. అయితే, చెప్పినట్టే శివకుమార్ ఫ్యాన్‌కు కట్టిన ఉరితాడుకి తలపెట్టి మంచంపై నిల్చున్నాడు. శివకుమార్ తనను ఆటపట్టిస్తున్నాడని భావించిన స్నేహితుడు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఆ తర్వాత కాసేపటికే స్నేహితుడు ఉరి బిగిసి మెడ కిందికి వాల్చేశాడు. దీంతో భయపడిన స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
Go Back to Shorts
Tirupati
suicide
video call
Andhra Pradesh

More Telugu News