Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్' అని నేనే రాజమౌళి గారిని అడిగాను: అలియా భట్

  • రాజమౌళిగారు ఎయిర్ పోర్టులో తారసపడ్డారు
  • నేరుగా ఆయనని అవకాశం అడిగేశాను
  •  ఇంత తొందరగా ఛాన్స్ ఇస్తారనుకోలేదు    
అలియా భట్ కి హిందీలో వున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఇక భాష విషయం పక్కన పెడితే కుర్రాళ్లంతా ఆమె అభిమానులే. అలాంటి అలియా భట్ హిందీలో 'బ్రహ్మాస్త్రా' .. 'ఇన్ షా అల్లా' సినిమాలు చేస్తోంది. తెలుగులో రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీలో చేస్తోంది. తెలుగు తెరకి ఈ సినిమా ద్వారానే ఆమె పరిచయం కానుంది. అలియా భట్ ను రాజమౌళి అతికష్టం మీద ఒప్పించి ఆమె డేట్స్ తీసుకున్నాడనీ, భారీ పారితోషికం ఆఫర్ చేసిన తరువాతనే ఆమె ఓకే చెప్పిందనే వార్త ఇటీవల షికారు చేసింది.

అయితే అందుకు పూర్తి విరుద్ధంగా అలియా భట్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. "ఒకసారి ఎయిర్ పోర్టులో రాజమౌళిగారు తారసపడ్డారు. సార్ .. మీ సినిమాల్లో నటించాలని వుంది .. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మీరు 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నారని విన్నాను .. అందులో ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తాను. డేట్స్ విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను అంటూ రిక్వెస్ట్ చేశాను. అప్పటికి హీరోయిన్స్ ఎంపిక పూర్తికాలేదు. అందువలన ఆయన నాకు ఒక హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. రాజమౌళిగారి వంటి గొప్ప దర్శకుడి ప్రాజెక్టులో ఇంత తొందరగా అవకాశం వస్తుందని నేను ఎంతమాత్రం అనుకోలేదు" అని ఆమె చెప్పుకొచ్చింది. 
rajamouli
alia bhatt

More Telugu News