Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సాయిపల్లవి ఎదురుచూపులు 
  • 'వెంకీమామ' షూటింగ్ అప్ డేట్
  • అఖిల్ సరసన రష్మిక 
*  సినిమాల పరంగా తనకొక కోరిక వుందని చెబుతోంది అందాలతార సాయిపల్లవి. 'సామాజిక స్పృహ కలిగిన, సందేశాత్మక కథా చిత్రంలో నటించాలన్నది నా కోరిక. అలాంటి చిత్రంలో నటించే అవకాశం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఇక, నా మనసుకు నచ్చే పాత్రలు వస్తున్నంత కాలం సినిమాలలో నటిస్తాను. అలాంటివి రానప్పుడు మెల్లిగా ఇక్కడి నుంచి తప్పుకుని, డాక్టర్ గా ప్రాక్టీస్ చేసుకుంటాను' అని చెప్పింది, మెడిసిన్ చదివిన సాయిపల్లవి.
*  వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న 'వెంకీ మామ' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. చిత్రంలోని ప్రధాన నటులు పాల్గొనే కీలక సన్నివేశాలను ప్రస్తుతం దర్శకుడు బాబి చిత్రీకరిస్తున్నాడు.
*  అఖిల్ అక్కినేని తన నాలుగో చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేయనున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా మొదట్లో కైరా అద్వానీని అనుకున్నారు. అయితే, తాజాగా రష్మిక మందనను తీసుకున్నట్టు సమాచారం.  
Saipallavi
Venkatesh
Chaitanya
akhil

More Telugu News