ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైంది: సీఎం కేసీఆర్

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైందిగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కాగా, కొలంబోలో 8 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో 250 మందికిపైగా మృతి చెందగా, మూడు వందల మందికి పైగా గాయపడ్డారు. పేలుళ్ల మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు.
Go Back to Shorts
Sri Lanka
colombo
cm
kcr

More Telugu News