గుంటూరులో బైక్ ను ఢీకొట్టిన వాహనం.. ఘటనాస్థలంలోనే ఇద్దరు యువకుల దుర్మరణం!
- జిల్లాలోని దాచేపల్లి వద్ద ఘటన
- పోలీసులకు వాహనదారుల సమాచారం
- మృతుల స్వగ్రామం బేధపూడిగా గుర్తించిన అధికారులు
ఈ ప్రమాదాన్ని అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా, ఈ దుర్ఘటనలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు గుంటూరులోని బేధపూడి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.