దాచుకున్న డబ్బంతా ఆ సినిమాతో పోయింది: సింగర్ మనో
గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న 'మనో' కొంతకాలం క్రితం సినిమా నిర్మాణ రంగంలోకి సైతం ప్రవేశించారు. అయితే అక్కడ చేదు అనుభవం ఎదురుకావడంతో, ఆపై అలాంటి ప్రయత్నాలను మానుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో అయన ఆ సంగతులను గురించి ప్రస్తావిస్తూ .. "స్నేహితుల కారణంగా 'తెలుగోడు' అనే సినిమా కోసం కోటి నలభై లక్షల వరకూ పెట్టుబడి పెట్టాను.
అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్ .. ముఖ్యంగా నా స్థాయికి మించిన పెట్టుబడి. అప్పటివరకూ దాచుకున్న డబ్బంతా ఆ సినిమాపై పెట్టేశాను .. నష్టాలు రావడంతో పెట్టిందంతా పోయింది. వయసులో ఉండగా ఆ నష్టం వచ్చింది కనుక తేరుకున్నాను .. వయసైపోయిన తరువాత ఇలాంటి ప్రయోగం చేసుంటే .. ఇక కోలుకునేవాడిని కాదు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఇక అప్పటి నుంచి నిర్మాణం వైపు పోలేదు .. పోను కూడా" అని చెప్పుకొచ్చారు.