విశాఖలో డ్రగ్స్ పార్టీ .. పోలీసుల అదుపులో నిందితులు!

  • 13న పార్టీ ఇచ్చిన సోనీ
  • డ్రగ్స్ వాడుతున్నారని పోలీసులకు సమాచారం
  • ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గోవా నుంచి విశాఖకు డ్రగ్స్
విశాఖపట్నం యువత క్రమక్రమంగా మాదకద్రవ్యాలకు దగ్గరవుతోంది. ఈ నెల 13న విశాఖలోని రుషికొండ ప్రాంతంలో సోనీ అనే వ్యక్తి నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. హుటాహుటిన అక్కడకు వెళ్లిన పోలీసులకు తనిఖీల్లో డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన ఐదుగురు యువకులను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.  

రెండు రోజుల తరువాత అక్కడి నుంచి డ్రగ్స్‌ను తరలించేందుకు యత్నించిన సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము గోవా నుంచి విశాఖకు డ్రగ్స్‌ను తీసుకొచ్చినట్టు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. దీనికి సంబంధించి మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు సోనీ మాత్రం తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Go Back to Shorts
Soni
Satyanarayana
Visakha
Party
Police
Drugs

More Telugu News