పంత్, రాయుడికి కూడా వరల్డ్ కప్ ఆడే చాన్స్!

  • ఇద్దరినీ స్టాండ్ బైలుగా ఎంపిక చేసిన బీసీసీఐ
  • నవదీప్ సైనీకి కూడా చాన్స్
  • ఎవరైనా గాయపడితే వీళ్లకు అవకాశం
వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కని రిషభ్ పంత్, అంబటి రాయుడులకు అనుకోని అవకాశం వచ్చింది. వీళ్లిద్దరినీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వరల్డ్ కప్ టీమ్ కు  అధికారిక స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. దేశవాళీ పేసర్ నవదీప్ సైనీకి కూడా స్టాండ్ బైగా చాన్స్ ఇచ్చారు. ఇప్పటికే టీమిండియాకు ఎంపికైన 15మందిలో ఎవరైనా బ్యాట్స్ మన్/బౌలర్ గాయపడితే స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో ఉన్న రాయుడు, పంత్, సైనీ అవకాశం దక్కించుకుంటారు.

దేశవాళీ ఫాస్ట్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, దీపక్ చహర్లను కూడా స్టాండ్ బైలుగా ఎంపిక చేసినా వాళ్లు అధికారిక జాబితాలో లేరు. బౌలర్లు అందరూ గాయాలపాలై ప్రత్యామ్నాయాలు లేనప్పుడే ఈ ముగ్గురు అవకాశాలు పొందుతారు.
Go Back to Shorts
Cricket

More Telugu News