ఈవీఎం, వీవీప్యాట్స్ ను హ్యాక్ చేయడం అసాధ్యం: మాజీ సీఈసీ సంపత్

  • ఓడిన పార్టీ నేతలు విమర్శించడం సహజం
  • ఈ ఎన్నికల్లో ఫలితాలు రాకుండానే విమర్శలా?
  • వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించడం కన్నా బ్యాలెట్ విధానమే నయం
ఈవీఎం, వీవీప్యాట్స్ ను హ్యాక్ చేయడం అసాధ్యమని మాజీ సీఈసీ విఎస్ సంపత్ అన్నారు. ఓడిన పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేయడం సహజం కానీ, ఈ ఎన్నికల్లో ఫలితాలు రాకుండానే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒక ఎన్నికల్లో ఓడినప్పుడు వీటి గురించి విమర్శించే వాళ్లు, మరో ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వీవీప్యాట్లను ప్రవేశ పెట్టే ముందు సీఈసీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మెజార్టీ పార్టీలు బ్యాలెట్ పద్ధతి వద్దన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 50 శాతం వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించడం కన్నా మళ్లీ బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టడం నయమని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Ex- cec
sampath
EVM`s
VVPATs
AP

More Telugu News