ఇది ఓటర్ ఐడీ కాదు... వివాహ శుభలేఖ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇది ఓటర్ ఐడీ కాదు... వివాహ శుభలేఖ!

  • వినూత్నతను సంతరించుకుంటున్న పెళ్లి పత్రికలు
  • ఓటు హక్కుపై చైతన్యం తేవాలన్న ఆలోచనలో వధూవరులు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శుభలేఖ
ఇటీవలి కాలంలో పెళ్లి పత్రికలు వినూత్నతను సంతరించుకుంటున్నాయి. ఆ తరహాలోనే ఓటర్ ఐడీ కార్డు మాదిరిగా తయారైన ఓ శుభలేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తేవాలన్న ఆలోచనతోనే ఇలా ఎన్నికల గుర్తింపు కార్డులా శుభలేఖను ప్రచురించామని వధూవరులు చెబుతున్నారు.

కర్ణాటకలోని ధార్వాడలో బెస్కాం అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న మంజునాథ్‌ కుమారుడు సునీల్‌ కు, హెస్కాంలో ఇంజనీర్‌ గా పని చేస్తున్న మహేశ్‌ అనే యువకుడి సోదరి అన్నపూర్ణలకు ఈనెల 26న వివాహం నిశ్చయించారు. ప్రస్తుతం లోక్‌ సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు ఆవశ్యకతను తమ పెళ్లికి వచ్చే బంధు మిత్రులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో, వీరు తమ శుభలేఖను వినూత్నంగా తీర్చిదిద్దారు. ఈ కార్డును మీరూ చూడవచ్చు.
Wedding Invitation
Voter ID
Karnataka
Marriage

More Telugu News