తాతయ్య పుట్టిన రోజు నాటికి నాన్నే సీఎం!: ఉదయనిధి స్టాలిన్
- తమిళనాట నేటితో ముగియనున్న ప్రచారం
- 22 మంది అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించండి
- స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సుడిగాలి ప్రచారం
ప్రజలు అన్నాడీఎంకేను బహిష్కరించే రోజులు త్వరలోనే రానున్నాయని, మోదీ ప్రధాని అయిన తరువాత అభివృద్ధిలో ఇండియా 25 ఏళ్లు వెనుకబడిపోయిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రతి కుటుంబానికీ నేరుగా అందిస్తానన్న మోదీ, ఆ పని చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.
డీఎంకే అధికారంలోకి వస్తే, నీట్ ను రద్దు చేసి, పేద విద్యార్థులు సైతం వైద్య విద్యను అభ్యసించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా డీఎంకేను ఆదరిస్తే, ఉప ఎన్నికలు జరిగే 22 నియోజకవర్గాల్లో డీఎంకే అభ్యర్థులు విజయం సాధిస్తారని, జూన్ 3న కరుణానిధి జయంతి వేడుకల నాడు స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు.